భారత్‌లో తన గోట్ టూర్ ను ముగించిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్‌కతా పర్యటనలు తనకు నమ్మశక్యం కాని అనుభూతిని ఇచ్చాయని మెస్సీ పేర్కొన్నారు. మీ ఆత్మీయ స్వాగతం గొప్ప ఆతిథ్యానికి ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అని మెస్సీ సందేశమిచ్చారు.