సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 11న కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో 60 కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పదివేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని, రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఆన్లైన్, క్యూఆర్ కోడ్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక నిరాశ నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తోందన్నారు.