దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంకలో ఆకస్మిక వరదలు, కొండచరియలు ఏర్పడి 56 మంది మృతి చెందారు మరో 21 మంది గల్లంతు అయ్యారు. దిత్వా తుపాను ప్రభావంతో 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతినగా, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి.