మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణంగా పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.