పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురుని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి విజయవాడ గంజాయిని నిందితులు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భీమవరంలో ప్రయాణికులను చెకింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ట్రైన్ దిగి పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి బ్యాగ్ చెక్ చేయగా నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. సుమారు ఐదు లక్షల విలువైన పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.