మంచు కుటుంబంలో వివాదం వేళ మంచు మనోజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. నేడు నటుడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకల రోజున నీ పక్కన లేకుండా చాలా మిస్ అవుతున్నా. నీతో ఉండటానికి వేచి ఉండలేకపోతున్నాను నాన్నా, నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.