తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన వ్యక్తి.. నాపైనే కేస్ పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. నల్గొండ జిల్లా కేంద్రంలో తప్పతాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులకు చిక్కిన రావిళ్ళ నరసింహ అనే వ్యక్తి. అతనిపై కేసు నమోదు చేసిన నల్గొండ 1 టౌన్ పోలీసులు. దీంతో నాపైనే కేస్ పెడతారా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ లొనే ఒంటికి నిప్పు అంటించుకున్న నరసింహ. మంటలు ఆర్పే క్రమంలో ఒక కానిస్టేబుల్కు గాయాలు.. నరసింహ పరిస్థితి విషమం