తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. దుళ్ళ గ్రామానికి చెందిన రుషి కుమార్, తేజ స్థానిక దుర్గమ్మ ఆలయం వద్ద నుండి వస్తుండగా అపరిచిత వ్యక్తి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతడి నుంచి ఆ ఇద్దరు చిన్నారులు తప్పించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమై అపరిచిత వ్యక్తిని బంధించి పోలీసులలకు సమాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారంతో కడియం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.