ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ యాష్ పాండ్ లో బూడిద లోడింగ్ లారీలు వందలాదిగా నిలిచిపోయాయి. బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ లారీ ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు న్యాయం చేయాలని లోకల్ లారీ ఓనర్లకు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.