కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో. అంతే తెలివిగానూ వ్యవహరిస్తుంటాయి. చాలా ప్రమాదాలను ముందే గుర్తించడంతో పాటూ ప్రమాదాల్లో పడిపోయిన వారిని కాపాడడంలోనూ ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలో మునిగిపోయిన స్నేహితుడిని.. ఓ కుక్క కాపాడిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.