జంతువులు మాట్లాడలేవు. మనుషుల్లా తెలివితేటలతో ప్రవర్తించలేవు. అయితే ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మనుషుల కంటే మెరుగ్గా ఉంటాయి. ప్రమాదాలను ముందుగానే పసిగడతాయి. తాజాగా ఓ పిల్లి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన యజమానిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.