అమెరికా అంటే శుభ్రత. శుభ్రత అంటే అమెరికా అన్నంతలా అక్కడి వాళ్లు తెగ ఫోజుకొడుతుంటారు. ఇక, ఇండియా మీద దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. అమెరికాలోని కొంతమందిని అపరిశుభ్రమైన దేశం ఏది? అని అడగ్గా. వారిలో చాలా మంది ఇండియా పేరు చెప్పారు. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ ఏదైనా చిన్న తప్పు చేస్తే.. ‘మా దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు అంటూ మండిపడుతూ ఉంటారు. అయితే పైన పటారం లోన లొటారం అన్నట్లుగా అమెరికా పరిస్థితి ఉంటుంది.