శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు అరుంధతీయవాడలో అర్ధరాత్రి వేళలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్న వారిని స్థానికులు అడ్డుకున్నారు. అన్యమత ప్రచారంలో ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ వెంకటరమణమ్మ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని.. చిన్నారులతోనూ ప్రచారాలు చేయించారు. దీన్ని గమనించిన స్థానికులు తమ గ్రామంలో మరోసారి అన్యమత ప్రచారం చేయవద్దని.. హెచ్చరించారు.