కాకినాడ జిల్లా యానాం శివారు సావిత్రి నగర్లో సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని మహిళలంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెంటనే అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. త్రాగునీరు, సాగునీటి ఇబ్బందులను మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మల్లాడి కృష్ణారావు భరోసా ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళనను విరమించి అక్కడి నుండి వెనుదిరిగారు.