శంషాబాద్‌లోని ఆర్సీఐ అటవీ ప్రాంతంలో భయభ్రాంతులకు గురిచేసిన రెండు చిరుతపులుల్లో ఒకటి ఆదివారం అటవీ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోన్లో చిక్కింది. సీసీ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాని కోసం గాలిస్తున్నారు. ఒక చిరుత బంధనంతో ఆర్సీఐ ఉద్యోగులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.