కొమురం భీం జిల్లా కాగజ్ నగర్-సిర్పూర్ ప్రధాన రహదారి పై చిరుత పులి హల్ చల్ చేసింది. భీమన్న దేవాలయం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రాత్రి ఓ చిరుత ప్రయాణికుల కంటపడింది. అటుగా వెళ్తున్న వారికి వంతెనపై ఒక్కసారిగా కనిపించేసరికి భయాందోళనకు గురయ్యారు. అయితే చిరుత తనదారిన తాను వెళ్తుండటంతో ప్రయాణికులు.. తమ కెమెరాల్లో వీడియోలు తీశారు. చిరుత వంతెనపై ఉన్న రోడ్డు గుండా రోప్ పైకి ఎక్కి కిందకు దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు అప్రమత్తం గా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.