తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర చిరుత పులి సంచరించడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. కోళ్ల గూడుపై చిరుత దాడి చేయడంతో కోళ్లన్ని ఒక్కసారిగా కేకలు పెట్టాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గతకొన్ని వారాలుగా వేదిక్, వెటర్నరీ, ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్లో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో అధికారులు 5 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా మూడు చిరుతలు సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.