ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గందసిరి లో చిరుతపులి కనిపించిందంటూ కలకలం రేగింది. పొలం పనుల నిమిత్తం వెళ్లిన గ్రామస్తులకు దూరం నుంచి ఓ జంతువు వెళ్ళడం తో చిరుతపులి గా భావించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అడుగులు పరిశీలించారు. గ్రామస్తులకు కనిపించిన అడుగులు నక్కవి అని ఫారెస్ట్ అధికారులు గుర్తించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.