అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం పొన్నేటి పాలెంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి చనిపోయింది. అధికారుల వద్ద సరైన సామాగ్రి లేకపోవడంతో చిరుతను కాపాడలేకపోయారు. గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు