జస్టిస్ గవాయ్ CJIగా ఉన్నప్పుడు ఆయనపైకి బూటు విసిరిన అడ్వకేట్ రాకేశ్ కిశోర్‌పై కడ్కడ్డూమా కోర్టు వద్ద ఓ లాయర్ దాడి చేశాడు. 70 ఏళ్ల కిశోర్ 'సనాతన్ ధర్మ్ కీ జయహో' అని నినదిస్తూ దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. 'ఒక కేసును హ్యాండోవర్ చేయడానికి ఉదయం కోర్టుకు వెళ్లగా యువ లాయర్ చెప్పుతో దాడి చేసేందుకు వచ్చాడు. గతంలో CJIపై దాడి చేసినందుకే ఈ పని చేశాడు' అని కిశోర్ తెలిపారు.