ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర.. హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ ధరించకపోవడంతో చాలామంది ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో కోల్పోతున్నారంటూ కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రానున్న రోజుల్లో హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.