సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.