సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఆలయ వర్గాలు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు, ఆలయ ఈవో వెంకటేష్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర లక్ష బిల్వార్చన, అన్న పూజ వంటి ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ గంగిరేగు చెట్టు వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, శివుని ఆకృతిలో లక్ష దీపాలను భక్తులు, స్థానిక మహిళలు ,ఆలయ సిబ్బంది వెలిగించారు.