కడపజిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వరుసగా జరిగిన బంగారం చోరీ కేసులను ఛేదించి దొంగలను అరెస్టు చేశారు. వన్ టౌన్ పరిధిలో దాదాపు 18 తులాల బంగారం దొంగిలించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. అలాగే త్రీ టౌన్ పరిధిలో జరిగిన మూడు తులాల చైన్ స్నాచింగ్ కేసును కూడా పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనాల కేసుల్లో.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.