తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థినులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం చదువు విషయంలో ఫిర్యాదు రావడంతో ఈ విద్యార్థినులు రంగు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నేటి విద్యార్థులకు చదువు కంటే ముందు ధైర్యం చాలా అవసరం అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోవాలని, ధైర్యంతో కూడిన ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ముందుగా ధైర్యాన్ని ఇచ్చి, లోక జ్ఞానాన్ని బోధించాలని ఆయన కోరారు.