చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. పులి సింహాల దాడిలో చనిపోతాయనుకున్న జంతువులు.. ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడుతుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వేటాడే సమయంలో అవే దాడికి గురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి చేపను వేటాడేందుకు ఒడ్డు సమీపానికి వచ్చింది. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి.