ఆదోనిని ప్రత్యేక జిల్లాగా సాధించే లక్ష్యంతో, బహుజన్ సమాఖ్య సమితి స్టేట్ ప్రెసిడెంట్ అమరేష్ ఆ ప్రాంతంలోని ప్రజా సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా, డిసెంబర్ 12న మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో BSS జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షలకు ఆదోని ప్రాంతానికి చెందిన అన్ని ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చి మద్దతు తెలపాలని అమరేష్ ఆకాంక్షించారు.