మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లు నివాళులర్పించారు. దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని నేతలు కొనియాడారు.