ఒమన్ నుంచి కామెరూన్‌లోని జిబౌటి వైపు వెళ్తున్న ఎంపీ ఫాల్కన్ అనే ఓడలో అడెన్ తీరానికి చేరుకోగానే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ గ్యాస్‌తో నిండి ఉండటం వల్ల పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. సమయానికి స్పందించిన ఈయూ నేవల్ ఫోర్స్ అధికారులు ఓడలోని 23 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. అయితే, ఈ పేలుడు హౌతీ దాడి వల్లే జరిగిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి.