ఆపరేషన్ సింధూర్పై భారత ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. నిన్న మధ్య రాత్రి భారత పశ్చిమ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి అనేక దాడుల చేసిందని పోస్ట్ చేశారు. భారత సైన్యం డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి, ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చింది. భారత ఆర్మీ దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.