నిర్మల్ జిల్లా బాసరకు చెందిన ఓ యువకుడు ఛత్రపతి శివాజీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆందోళన కు దారి తీసింది. ఆ యువకుడి వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాత్రంతా హిందూ సంఘాల నిరసన చేపట్టాయి. నిందితున్ని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగాయి. దీంతో విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.