కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి పంచాయతీలో సొంత సోదరుల మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ సర్పంచి స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించగా... ఈ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు ఏడు ఉన్నాయి. బీఆర్ఎస్ మద్దతుతో కమ్మరి కృష్ణ, కాంగ్రెస్మద్దతుతో కమ్మరి పెంటయ్య పోటీ పడుతున్నారు. వీరిద్దరూ సొంత సోదరులు. ఇక వీరిద్దరి సొంత బాబాయి కుమారుడైన కమ్మరి శేఖర్ బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 1,060 మంది ఓటర్లు ఉండగా... వారిలో ఎస్టీ ఓటర్లు 15 మంది మాత్రమే ఉన్నారు. కాగా.. 2018లో చోర్పల్లి పంచాయతీగా ఏర్పడగా.. అప్పటినుంచి ఆ కుటుంబ సభ్యులే సర్పంచి పదవిని చేపడుతూ వస్తున్నారు.