సంతోష్ దాబా పేరుతో అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపైన సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు, గోషామహల్, ఆబిడ్స్ పోలీసులు, చర్యలు తీసుకున్నారు. సంతోష్ దాబా పేరుతో చాలా మంది రెస్టారెంట్లు ఓపెన్ చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని.. దీంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు సంతోష్ దాబా ఎక్స్‌క్లూజివ్ ట్రేడ్ మార్క్ యజమాని మనోజ్ కుమార్ తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు.. నకిలీ సంతోష్ దాబాలపైన దాడులు చేసి.. నిర్వహించి, కోర్టు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి దాబాలకు సంతోష్ పేరును తొలగించారన్నారు. అనంతరం, దాబా లో ఉన్న బిల్లింగ్ మెషిన్, కంప్యూటర్, మెనూ కార్డులు, అడ్వర్టైజింగ్ లైటింగ్ బోర్డులు, ఇతర సామాగ్రిని, స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఒరిజినల్ సంతోష్ దాబా యజమాని మనోజ్‌కు అందజేశారు. ఇప్పటికే నగరంలో సంతోష్ దాబా పేరుతో ఉన్న 40కిపైగా బోర్డులను తొలగించారు.