కృష్ణానదిపై సోమశిల వద్ద $1,083 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి పనులు త్వరలో మొదలవుతాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఎంపీ ఈటెల, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సుధాకర్ రావు కలిసి బ్రిడ్జి నిర్మాణం స్థలాన్ని లాంచీలో తిరిగి పరిశీలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును మంజూరు చేశారని, రోడ్ల అభివృద్ధి ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఈటెల అన్నారు. బీజేపీతోనే పేదల సంక్షేమం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.