నగర ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ శ్రమించే హైడ్రా సిబ్బంది శనివారం క్రికెట్ ఆడి సేదతీరారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, వర్షాకాలంలో వరద కష్టాలతో తలమునకలైన సిబ్బంది ఆనందంగా గడిపారు. ఫతుల్గూడలోని హైడ్రా క్రీడామైదానంలో 'అసెట్స్ ప్రొటెక్షన్' , 'డిజాస్టర్ మేనేజ్మెంట్' విభాగాలు రెండు జట్లుగా పోటీపడ్డాయి.