సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 3 వద్ద సిద్ధిపేట నుంచి శంకర్పల్లికి శుభకార్యానికి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పటాన్చెరు బీఆర్ఎస్ నేత మాణిక్ యాదవ్ వెంటనే స్పందించి, కారులోని కుటుంబ సభ్యులను బయటకు దించారు. దీంతో ఆ కుటుంబం సురక్షితంగా బయటపడగా, కారు పూర్తిగా దగ్ధమైంది.