హైదరాబాద్ మలక్‌పేటలోని ఎంఎస్ కాలేజీలో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పుస్తకాలు, సెల్ఫోన్లు పెట్టుకొని యథేచ్ఛగా కాపీ కొట్టినట్లు విమర్శలు వెలువడ్డాయి. పరిశీలనకు స్క్వాడ్ వస్తున్నారని తెలియగానే, విద్యార్థులు తాము కాపీ కొట్టడానికి తెచ్చుకున్న పుస్తకాలను రోడ్డుపై విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.