సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండలో దారుణం చోటు జరిగింది. రోకలి బండతో కొట్టి భార్యను ఆమె భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతుల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వెంకన్న అకారణంగా భార్యను వేధింపులకు గురిచేసేవాడిని ఈ క్రమంలోనే జరిగిన గొడవలో హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వెంకన్న సైకో మెంటాలిటీ కారణంగానే మొదటి భార్య వదిలేసినట్టు తెలుస్తోంది.