జగిత్యాలజిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ సమీపంలోని గుట్టపై గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. లింగ చెరువు సమీపంలోని గుట్టపై గల ధనం గుండులో గుప్త నిధులు ఉన్నట్టుగా చాలా ఏళ్ళుగా స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో బండరాతిపై మూత ఆకారంలో వున్న కొంత భాగం దెబ్బతిన్నట్లుగా కనిపిస్తుంది. రాళ్లను పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.