పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ సందర్శకులతో సందడిగా మారింది. కార్తీక మాసం కావడంతో బీచ్లో స్నానాలు చేసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీచ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. బీచ్లో స్నానాలు చేసే ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో బీచ్ లో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.