భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉద్యోగం పేరుతో మోసపోయామంటూ తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశ్వాపురం భారజల కర్మాగారం లో కంప్యూటర్ ఆపరేటర్ గా టెంపర్వరి ఉద్యోగం ఇప్పిస్తామని ఇద్దరు ఘరానా మోసగాళ్ళు.. ఇల్లందు కి చెందిన మల్లేష్ అనే వ్యక్తి నుంచి 7 లక్షల నగదు , 3 తులాల బంగారం తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగమంటూ ఫేక్ ఇంటర్వ్యూ చేశారని.. ఇప్పుడు తీరా చూస్తే ఉద్యోగం లేదంటున్నారని బాధితులు వాపోయారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.