హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టడంతో గొడవకు దిగారు. క్యాబ్ డోరు తెరిచి లోపల ఉన్న ఐటీ ఉద్యోగులపై దాడి చేసేందుకు యత్నించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.