నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారం మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు.. ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు. అయితే.. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు.. ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దంటూ ఎమ్మెల్యే సూచించారు. అందులో భాగంగానే ప్రస్తుతం వైన్స్ టెండర్లు దక్కించుకున్నవారు.. ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించి.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచే విక్రయాలు ప్రారంభించారు.