ఏపుగా పెరిగిన మిరప పంటపై పూర్ణచంద అనే వ్యక్తి గడ్డి మందు పిచికారి చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని మంత్రాలయానికి చెందిన రైతు శివన్న ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి వారి కుటుంబానికి గత కొన్ని రోజులుగా భూతగాధలు ఉన్నాయని అన్ని కోర్టులో నడుస్తుండడంతో ఎవరి పనులు వారు చేసుకుంటూ శాంతియుత జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే 66 సెంట్ల భూమిలో గత 20 సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని ఈ ఏడాది మిరప పంట సాగు చేశానని పంట చేతికొచ్చే సమయంలో పూర్ణచంద్ర అనే వ్యక్తి మరో వ్యక్తి కలిసి గడ్డి మందు పిచికారి చేయడంతో పూర్తిగా ఎండిపోయింది అన్నారు.