కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని పొగ మంచు కప్పేసింది. లోయర్ మానేరు డ్యాం పరిసరాలన్నీ పొగ మంచుతో కమ్మేయడంతో చూపర్లను ఆకట్టుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్ జాతీయ రహదారులపై పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 దాటినా లైట్లు వేసుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. అలుగునూర్ చౌరస్తా దగ్గర దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.