నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో దారుణం జరిగింది. సిద్ధిరాం అనే వ్యక్తిపై అతడి బంధువులే విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇటీవల సిద్దిరాం తన బంధువులతో గొడవ పెట్టుకున్నారు. దీంతో సిద్ధరాంపై కక్ష పెంచుకొన్న బంధువులు.. కర్రలు, రాళ్లతో అతడిపై దాడి చేశారు. రాయితో తలపై కొట్టారు. పక్కనే ఉన్న స్త్రీలు కొట్టొద్దని వేడుకున్నా వినలేదు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.