పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు పాము ముందు ఫన్నీ గేమ్స్ ఆడడడం చూస్తుంటాం. బూర ఊదుతూ కొందరు, డాన్స్ చేస్తూ మరికొందరు పాములను రెచ్చగొడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ పాము వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పాము ముందు బెలూన్ ఊది రెచ్చగొట్టాడు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.