TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచారి(50) అనే వ్యక్తి తన భార్య సంధ్యను ఉరి వేసి చంపి.. తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపి ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.