యూపీకి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆదిత్య, కేవలం రూ.25 వేల ఖర్చుతో ఇంట్లోనే ఏఐ లేడీ టీచర్ 'సోఫీ'ని తయారు చేశాడు. ఇందులో LLM చిప్సెట్ అమర్చాడు. ఇది మానవ మెదడు లాగే స్పందించి, విద్యార్థుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇవ్వగలదని ఆదిత్య వివరించాడు. ఈ చౌకైన, అత్యాధునిక ఆవిష్కరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.