ఫ్రెంచ్ సైక్లిస్ట్ ఆరేలియన్ ఫాంటెనాయ్ సైకిల్ పై కూర్చొని ఐఫిల్ టవర్ ఎక్కి అద్భుతం సృష్టించారు. ఎక్కడా ఆపకుండా, కాళ్లను నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను 12 నిమిషాల్లో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ రికార్డు గతంలో హ్యూగ్స్ రిచర్డ్ పేరిట ఉండేది.